News March 27, 2025
KTDM: కేసీఆర్ పాలనలో రైతులకు మేలు: నిర్మలమ్మ

MP వద్దిరాజు రవిచంద్ర బుధవారం రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడారు. TG తొలి సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణాలను ఏక మొత్తంలో మాఫీ చేసి వ్యవసాయ రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని వివరించారు. కాగా, దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా స్పందిస్తూ.. కేసీఆర్ పాలనలో రైతులు, వ్యవసాయ రంగానికి మేలు జరిగిన మాట నిజమేనన్నారు. అయితే, కాంగ్రెస్ 2008-09లో రైతు రుణ మాఫీ గురించి హామీలిచ్చి నెరవేర్చలేదన్నారు.
Similar News
News September 19, 2025
క్రికెట్ ఆడిన ఆదిలాబాద్ SP

జిల్లా స్థాయిలో పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్‌ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమ సందర్భంగా గెలుపొందిన సూపర్ స్ట్రైకర్స్ బృందానికి మొదటి బహుమతి, రన్నరప్‌గా నిలిచిన ఆదిలాబాద్ రాయల్స్ బృందానికి 2వ బహుమతిని అందజేశారు.
News September 19, 2025
తలమడుగు: కలప అక్రమ రవాణా

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాపూర్ సమీపంలోని MS గార్డెన్‌లో సిబ్బంది తనిఖీలు చేశారు. రూ.84 వేల విలువైన టేకు కలప దొరికినట్లు చెప్పారు. కలపను జప్తు చేసి యజమాని మొహమ్మద్ మూసా, లక్షణ్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
News September 19, 2025
SRPT: ‘సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించాలి’

భూ భారతి చట్టం అమలులో భాగంగా సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి నోటీసులు జారీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కే.సీతారామారావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్డీవోలు, తహశీల్దార్లతో రెవెన్యూ అంశాలపై ఆయన వెబ్‌ఎక్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు, తహశీల్దార్లతో పాటు ఈ-సెక్షన్ సూపరింటెండెంట్ సాయి గౌడ్, డీటీ వేణు తదితర అధికారులు పాల్గొన్నారు.