News March 27, 2025
వనపర్తి: మృతిపై అనుమానం.. అంత్యక్రియలు నిలిపివేత..!

ఓ వ్యక్తి మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు..వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం వాసి కృష్ణయ్య(42) మృతిచెందాడు. బుధవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అతడి మోకాళ్ల వద్ద గాయాలు,శరీరం మొత్తం ఉబ్బి ఉండడం గమనించిన బంధువులు దహన సంస్కారాలను నిలిపివేశారు. ఈవిషయమై మృతుడి చిన్నాన్న వెంకన్న PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి బాడీని జిల్లా మార్చురీకి తరలించామని SIసురేశ్ తెలిపారు.
Similar News
News April 1, 2025
కడపలో హిజ్రాల ఆందోళన

పదేళ్లుగా హిజ్రాతో సహజీవనం చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హిజ్రాలు కోరారు. ఈ మేరకు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు 50మందికి పైగా హిజ్రాలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సీఐ రామకృష్ణ జోక్యం చేసుకుని విచారించి న్యాయం చేస్తామన్నారు. ఆయన హామీతో హిజ్రాలు ఆందోళన విరమించారు.
News April 1, 2025
ఇళ్ల నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయం: ప్రభుత్వం

AP: SC, ST, BC, ఆదివాసీ గిరిజనుల(PVTG) వర్గాల లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో అసంపూర్తిగా ఉన్నవాటి నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయాన్ని కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘మారిన ఖర్చుకు తగిన విధంగా ఎస్సీలకు రూ.50వేలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నాం’ అని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ MD రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
News April 1, 2025
GNT: హైకోర్టుకు మాజీమంత్రి విడదల రజిని

ఏసీబీ కేసులో ఏపీ హైకోర్టును మంగళవారం మాజీ మంత్రి విడదల రజిని ఆశ్రయించారు. ఏసీబీ కేసు నుంచి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ పిటిషన్లు దాఖలు చేశారు. వివరాలు సమర్పించాలని హైకోర్టు ఏసీబీకి ఆదేశించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.