News March 27, 2025
మేయర్ కలిసిన ఇండియానాలో పోలో బృందం

అమెరికాకు చెందిన ఇండియానాలో పోలో బృందం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో భేటీ అయ్యింది. 2010లో ఇండియనా స్టేట్ పలు అంశాలపై సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో మేయర్ ఆ బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ధన్యవాదాలు తెలిపారు. సిస్టర్ సిటీ ఒప్పందంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇండియనా ప్రతినిధులు మేయర్‌కు వివరించారు.
Similar News
News February 19, 2026
మంగినపూడి బీచ్‌లో 24న సందడే సందడి..!

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా స్థాయి సాప్ లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఈనెల 24న మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద నిర్వహించనున్నారు. అండర్-18 బాలురకు 10 కి.మీ., బాలికలకు 5 కి.మీ. దూరంతో పోటీలు నిర్వహిస్తారు. పాల్గొనదలచిన క్రీడాకారులు www.sports.ap.gov.inలో ముందుగా నమోదు చేసుకోవాలని జిల్లా క్రీడా అధికారి తెలిపారు.
News February 19, 2026
‘పెద్ది’ విడుదలకు ముందే ₹150 కోట్ల బిజినెస్?

రామ్ చరణ్, బుచ్చిబాబు క్రేజీ కాంబోలో వస్తున్న‘పెద్ది’ నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ₹130 కోట్లకు కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఆడియో హక్కులు మరో ₹18 కోట్లు పలికినట్లు టాక్. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులతో కలిపి రిలీజ్‌కు ముందే ₹150 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
News February 19, 2026
ఈనెల 20న గద్వాలలో జాబ్ మేళా..!

గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీల్లో శిక్షణ, ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. శ్రీ చరణ్ దీప్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎఫ్ 30/1 లో ఉదయం 11:00 గంటలకు జరిగే జాబ్ మేళాకు 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండి ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారు హాజరు కావాలన్నారు.


