News March 27, 2025

VKB: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం VKB డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు.జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

Similar News

News November 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News November 3, 2025

గంగవరం బీచ్‌లో యువకుడు గల్లంతు

image

గంగవరం సమీపంలోని మాధవస్వామి టెంపుల్ వద్ద యువకుడు కెరటాల తాకిడికి గల్లంతయ్యాడు. ఒడిశాకు చెందిన నలుగురు యువకులు, గంగవరం సమీపంలో బీచ్‌కు సందర్శనకు వెళ్ళగా మాధవస్వామి టెంపుల్ వద్ద రాళ్లపై నిలబడి రూపక్ సాయి అనే యువకుడు ఉండగా కెరటాల ఉధృతికి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న న్యూపోర్ట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన యువకుడు‌ పెదగంట్యాడ మండలం సీతానగరంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

News November 3, 2025

4న ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో జట్ల ఎంపిక

image

తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్ శివారులోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో ఈనెల 4న ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్స్ ఖోఖో జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఎంపికైన ఉమ్మడి జిల్లా మహిళ, పురుషుల జట్లు 7న పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు. వివరాలకు 99637 70406, 95538 10943 సంప్రదించాలన్నారు.