News March 27, 2025
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విడదల రజిని

నేడు హైకోర్టులో విడదల రజిని పిటిషన్‌పై విచారణ జరగనుంది. స్టోన్ క్రషర్ యాజమాన్యానికి బెదిరింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ రజిని పిటిషన్ వేశారు. ఎడ్లపాడు శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ దగ్గర రూ.2.20కోట్లు తీసుకున్నట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. హైకోర్టు బెయిల్ విషయంలో గురువారం తీర్పు ఏమి చెబుతుందనే మాజీ మంత్రి విడదల రజిని శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News March 4, 2026
NZB: ఎవరి పరిధిలో వారు పని చేసుకోవాలి: కాంగ్రెస్

జిల్లా అధ్యక్షుడు, కార్పొరేషన్ DCC అధ్యక్షుల పదవులు రెండూ సమాన హోదా కలిగినవిగా పరిగణించాలని, ఎవరి పరిధిలో వారు పని చేసుకోవాలని అధిష్టానం సూచించినట్లు NZB కార్పొరేషన్ DCC అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ చెప్పారు. బుధవారం DCC కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 రోజుల పాటు కాంగ్రెస్ అధిష్టానం తమకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.
News March 4, 2026
ఏటూరునాగారం ట్రైబల్ కాలేజీలో పుడ్ పాయిజన్

ఏటూరునాగారంలోని ట్రైబల్ జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. గత 3 రోజులుగా విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఆదివారం వండిన చికెన్ కారణంగా నాసిరకం, ఉడకని భోజనం వడ్డించగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధ్యులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్ డిమాండ్ చేశారు. ఐటీడీఏ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
News March 4, 2026
భయం పుట్టించే B-2 తయారీలో ఇండో-అమెరికన్!

ప్రపంచంలో భయంకరమైన యుద్ధ ఆయుధాల్లో <<19277612>>B-2<<>> బాంబర్ టాప్‌లో ఉంటుంది. దీని తయారీలో భారత సంతతికి చెందిన నోషిర్ గొవాడియాది కీలకపాత్ర. 1944లో బాంబేలో జన్మించిన ఈయన USకు వెళ్లి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. నార్త్‌రోప్ గ్రుమ్మన్ కంపెనీలో డిజైన్ ఇంజినీర్‌గా చేరారు. B-2 బాంబర్లు శత్రువుల రాడార్లకు కనబడకుండా స్పెషల్ డిజైన్ చేశారు. చైనాకు దీని సమాచారం ఇచ్చారని US కోర్టు 2010లో 32 ఏళ్ల జైలుశిక్ష విధించింది.


