News March 27, 2025

HYD: ఏటా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్!

image

ఏటా రొమ్ము, గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HYDలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 2021లో 1240 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 2024లో 1791 మంది బాధితులు దీని బారిన పడ్డారు. అదే 2021లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 1033 నమోదు కాగా.. 2024లో వాటి సంఖ్య 1262కు చేరింది. MNJ ఆస్పత్రి విస్తరించి కొత్త భవనంలోనూ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.

Similar News

News October 20, 2025

509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 341, మహిళలకు 168 జాబ్‌లు ఉన్నాయి. వయసు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. SC, STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://ssc.gov.in

News October 20, 2025

దీపావళి రోజున కచ్చితంగా చేయాల్సిన పనులు

image

లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే ఇష్టం. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచి, ప్రతి మూల దీపాలు వెలిగించి పూజ చేయాలి. పూజ సమయంలో విగ్రహం (లేదా) ఫొటోను ఎర్రటి వస్త్రంపై ఉంచాలి. పూజను తూర్పు (లేదా) ఈశాన్య మూలలో చేయాలి. ఇంటి గుమ్మం వద్ద కుంకుమ, పసుపుతో స్వస్తిక్ వేసి, గడపకు పూజ చేయాలి. ఇది పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తుంది. పూజలో భాగంగా అఖండ దీపం వెలిగిస్తే.. అది మరుసటి రోజు ఉదయం వరకు ఆరిపోకుండా జాగ్రత్త వహించాలి.

News October 20, 2025

వచ్చే నెల 3 నుంచి కాలేజీల బంద్!

image

TG: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోతే వచ్చే నెల 3 నుంచి కాలేజీల బంద్ చేపడుతామని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తెలిపాయి. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుకు వినతి పత్రం అందజేశాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.900 కోట్లను నవంబర్ 1వ తేదీలోపు రిలీజ్ చేయాలని కోరాయి. బంద్‌కు సంబంధించి ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి.