News March 27, 2025
వనపర్తి జిల్లాలో మండుతున్న ఎండలు..!

వనపర్తి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అత్యధికంగా కనాయిపల్లిలో 40.9℃ ఉష్ణోగ్రత నమోదైంది. రేమద్దుల 39.8, కేతేపల్లి 39.7, పెబ్బేరు, వెల్గొండ 39.6, గోపాలపేట 39.4, దగడ 39.3, విలియంకొండ 39.2, విపనగండ్ల 39.1, శ్రీరంగాపురం, పంగల్ 39, జనంపేట, ఆత్మకూర్ 38.9, రేవల్లి 38.8, వనపర్తి 38.7, మదనాపురం 38.6, సోలిపూర్ 38.4, పెద్దమందడి 38.1, ఘనపూర్ 37.9, అమరచింతలో 37.7℃ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News November 5, 2025
‘ఏటిమొగ-ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం’

ఏటిమొగ-ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని డీసీఎం పవన్ అన్నారు. బుధవారం ఆయన ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఇతర అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఏటిమొగ-ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణానికి రూ.109 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయన్న పవన్.. అలైన్‌మెంట్‌లో మార్పుల కారణంగా మరో రూ.60 కోట్ల వ్యయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారన్నారు.
News November 5, 2025
GET READY: మరికాసేపట్లో..

మరికొన్ని నిమిషాల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా సా.6.49 గంటలకు చంద్రుడు భూమికి అతి సమీపంగా వచ్చి కనువిందు చేయనున్నాడు. సాధారణ రోజులతో పోలిస్తే భూమికి దగ్గరగా చంద్రుడు రావడంతో 14% పెద్దగా, 30% అధిక కాంతితో దర్శనమిస్తాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి.
News November 5, 2025
బాపట్లలో కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

బాపట్ల పట్టణంలోని మరుప్రోలు వారి పాలెం గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై బుధవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


