News March 27, 2025
భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎన్‌కౌంటర్

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతోంది. నేడు రాజ్‌బాగ్ సమీపంలోని ఘాటి జుథానాలో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చారు. హిరానగర్ సెక్టార్లో ఆదివారం నాటి యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్‌లో తప్పించుకున్న ముష్కరులనే నేడు చంపేశారని సమాచారం. నాలుగు రోజులుగా ఇక్కడ టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోంది.
Similar News
News October 31, 2025
బ్రూసెల్లోసిస్ వ్యాధి.. నివారణ, జాగ్రత్తలు

ఈ వ్యాధి నివారణకు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి. 4 నుంచి 8 నెలల వయసున్న దూడలకు బ్రూసెల్లా వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. పశువు ఈడ్చుకు పోయినప్పుడు దాని పిండాన్ని, మాయను, గర్భాశయ ద్రవాలు, ఇతర చెత్తను దూరంగా తీసుకెళ్లి కాల్చేయాలి. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి దూరంగా ఉంచాలి. పశువుల పాకలను శుభ్రంగా ఉంచాలి. చికిత్స చేసేటప్పుడు వెటర్నరీ డాక్టర్లు తగిన వ్యక్తిగత రక్షణ చర్యలు తీసుకోవాలి.
News October 31, 2025
‘బాహుబలి-ది ఎపిక్’ పబ్లిక్ టాక్

బాహుబలి సినిమా రెండు పార్టులను కలిపి మేకర్స్ ‘బాహుబలి-ది ఎపిక్’గా రిలీజ్ చేశారు. పాతదే అయినా కొత్త మూవీ చూసినట్లు అనిపిస్తోందని ప్రీమియర్లు చూసిన వారు చెబుతున్నారు. ఎడిటింగ్, మ్యూజిక్, విజువల్స్ అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయంటున్నారు. అయితే కొన్ని నచ్చిన సీన్లతో పాటు పాటలు లేకపోవడం నిరాశకు గురిచేసిందని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో WAY2NEWS రివ్యూ.
News October 31, 2025
నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదనే నమ్ముతా: ఉప రాష్ట్రపతి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని దేవర్ చెప్పినట్లు ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ పేర్కొన్నారు. తమిళనాడులోని పసుంపొన్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు ముత్తురామలింగ దేవర్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. “నేతాజీకి దేవర్ బలమైన మద్దతుదారుడు. ఆయన జీవితంలో అబద్ధం ఆడలేదు. ‘నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు. నేను ఆయన్ను కలిశాను’ అని దేవర్ చెప్పారు. నేను అదే నమ్ముతాను” అని తెలిపారు.


