News March 27, 2025
WGL: ఈ వారంలో పత్తికి భారీ ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఈరోజు అన్నదాతలకు మళ్ళీ ఊరటనిచ్చాయి. ఈ వారం మొదటి నుంచి పోలిస్తే ఈరోజు పత్తి ధర అధికంగా పలికింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,030, మంగళవారం రూ.7,045, బుధవారం రూ.7,010 పలికిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ధర రూ.7050 కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
Similar News
News April 1, 2025
NRPT: ‘HCU భూముల అమ్మకాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి’

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని నిలిపివేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, CITU కార్యదర్శి బలరాం డిమాండ్ చేశారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు, సంపదను కార్పొరేట్ బడా కంపెనీలకు అప్పజెప్పి విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఉద్యమిస్తున్న విద్యార్థులను అణిచివేయడం తగదన్నారు.
News April 1, 2025
SKLM: హెడ్ కానిస్టేబుల్‌ను సత్కరించిన జిల్లా ఎస్పీ

శ్రీకాకుళం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో సుమారు 41సంవత్సరాలు పాటు హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసిన పి. కృష్ణమూర్తి మార్చి 31న (సోమవారం) ఉద్యోగ విరమణ చెందారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కృష్ణమూర్తికి శాలువా, పూల దండతో సత్కరించారు. అనంతరం జ్ఞాపికను ప్రధానం చేసి పోలీస్ అధికారుల సమక్షంలో ఆత్మీయ వీడ్కోలు పలికారు.
News April 1, 2025
SSS: జిల్లా ప్రత్యేక అధికారిని కలిసిన కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లా ప్రత్యేక ఐఏఎస్ అధికారి హరినారాయణను కలెక్టర్ చేతన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం పెనుకొండలోని సబ్ కలెక్టర్ బంగ్లాలో ఆయనను కలిసి పూలగుత్తి ఇచ్చారు. ప్రభుత్వం హరినారాయణను జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించింది. దీంతో ఆయన మొదటిసారిగా జిల్లాకి రావడంతో చేతన్ ఆయనను కలిసి జిల్లాని అభివృద్ధి బాటలో పయనింపచేయడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను చర్చించారు.