News March 27, 2025
శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది ఉత్సవాలు

AP: శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభంకానున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. వేడుకల్లో భాగంగా రోజూ సాయంత్రం అమ్మవారికి, స్వామివార్లకు ప్రత్యేక అలంకరణలు, వాహన సేవ చేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఉత్సవ మూర్తులకు రాత్రి 7గం. గ్రామోత్సవం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలు నేటినుంచి ఐదురోజుల పాటు జరగనున్నాయి.
Similar News
News April 1, 2025
వడగాలులు, పిడుగులతో వర్షాలు.. రేపు జాగ్రత్త

AP: రాష్ట్రంలో రేపు 30, ఎల్లుండి 47 మండలాల్లో <
News April 1, 2025
జొమాటోలో 600 మంది ఉద్యోగులు ఔట్

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన ఉద్యోగులకు షాకిచ్చింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌గా పనిచేస్తున్న దాదాపు 600 మందిని తొలగించింది. ఈ విభాగంలో ఏడాది కిందట 1,500 మందిని నియమించుకోగా, ఇంతలోనే పలువురికి లేఆఫ్స్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పేలవమైన పనితీరు, ఆలస్యంగా రావడం వంటి కారణాలు చూపుతూ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే తొలగించినట్లు సిబ్బంది వాపోతున్నారు.
News April 1, 2025
ట్రంప్ సుంకాల ప్రభావం.. ఈ దేశాలే లక్ష్యం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న సుంకాలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా 10 నుంచి 15 దేశాలపై వాటి ప్రభావం ఉంటుందని అంచనా. చైనా, ఐరోపా సమాఖ్య దేశాలు, మెక్సికో, వియత్నాం, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, కెనడా, భారత్, థాయ్‌లాండ్, స్విట్జర్లాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలను అమెరికా లక్ష్యంగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది.