News March 27, 2025
అనకాపల్లి: యాక్సిడెంట్ చేసిన కొడుకు.. తండ్రిపై కేసు

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు ఎంత మొత్తుకున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. వారికి వాహనాలు ఇచ్చి పలు కుటుంబాల్లో విషాదం నింపడమే కాక.. వారు కూడా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఈనెల22న చోడవరం మండలం గోవాడలో ఓ బాలుడు బైక్ నడిపి టీచర్‌తో పాటు ముగ్గురు విద్యార్థులను ఢీకొట్టాడు. దీంతో బాలుడి తండ్రిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
Similar News
News November 8, 2025
KMM: ఐటీ – వ్యవసాయం మేళవింపులో రాష్ట్రానికే ఆదర్శం

నూకలంపాడు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రతి ఇంట్లో ఓ కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఐటీలో పనిచేస్తుండగా, మరో కుమారుడు వ్యవసాయం చేస్తూ పొలాన్ని నమ్ముకుని ఉండటం విశేషం. ఆధునిక సాంకేతికతతో సంపాదన, భూమిపై ప్రేమను బ్యాలెన్స్ చేస్తూ ఈ రెండు రంగాల్లో రాణిస్తున్నారు. ఒకరు సాంకేతికతతో, మరొకరు వ్యవసాయంతో ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తూ ఈ గ్రామం ఇతర గ్రామాలకు స్ఫూర్తినిస్తోంది.
News November 8, 2025
మాలిలో ఐదుగురు ఇండియన్ కార్మికుల కిడ్నాప్

ఆఫ్రికన్ కంట్రీ మాలిలో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురు ఇండియన్ కార్మికుల్ని దుండగులు కిడ్నాప్ చేశారు. వెస్ట్రన్ మాలిలోని కోబ్రీలో విద్యుదీకరణ ప్రాజెక్టు పనుల్లో వారుండగా ఇది జరిగినట్లు భద్రతావర్గాలు AFPకి తెలిపాయి. మిగతా కార్మికుల్ని రాజధాని బమాకోకు తరలించారు. అల్‌ఖైదాతో సంబంధాలున్న JNIM జిహాదీలు ఇటీవల ముగ్గురిని అపహరించి $50Mలు తీసుకొని విడిచిపెట్టారు. తాజా ఘటనపై ఇంకా ఏ సంస్థా స్పందించలేదు.
News November 8, 2025
TMF మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా కొండల్ రెడ్డి

తెలంగాణ గణిత ఫోరం మెదక్ జిల్లా నూతన శాఖ ఏర్పడింది. TMF మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బి .కొండల్ రెడ్డి (జడ్పీహెచ్ఎస్ కూచన్‌పల్లి పాఠశాల), ప్రధాన కార్యదర్శిగా గోపాల్ (జడ్పిహెచ్ఎస్ ఝాన్సీ లింగాపూర్), కోశాధికారిగా శివ్వ నాగరాజు (శంకరంపేట(R)), ఉపాధ్యక్షుడిగా బాలరాజు (జడ్పీహెచ్ఎస్ కుర్తివాడ) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గౌరవ అధ్యక్షుడు సదన్ కుమార్ తెలిపారు.


