News March 27, 2025
పాలమూరు యూనివర్సిటీలో ఉగాది వేడుకలు ప్రారంభం

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఉగాది వేడుకలను యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలో విశ్వావసు నామా సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని కాంశించారు. కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
సిరిసిల్ల జిల్లాలో 12,150 మంది మధుమేహ బాధితులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12,150 మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా వైద్యులు డయాబెటిస్ నివారణ చర్యలను సూచించారు. 3 నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ ఆహార నియమాలు పాటిస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుందని తెలిపారు. డయాబెటిస్ ఉందని భయపడాల్సిన అవసరం లేదని, ప్రతినిత్యం ఉదయం నడకతో పాటు, ఎక్సర్‌సైజ్ చేయాలని సూచించారు.
News November 14, 2025
సాక్షి మృతి.. అదే ఫార్ములా రిపీట్: TDP

TTD మాజీ AVSO సతీశ్ మృతిపై TDP చేసిన వరుస ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ‘కేసులో సాక్షి గల్లంతైతే నేర నిరూపితం కష్టమే. అందుకేనేమో కేసు కొలిక్కి వస్తుందనుకున్న టైంలో సాక్షి చచ్చిపోతాడు. పరిటాల రవి కేసు నుంచి పరకామణి కేసు వరకు అదే ఫార్ములా రిపీట్. నాడు బాబాయ్ వివేకానంద రెడ్డిపై గొడ్డలి వేటు వేసి గుండెపోటు అని, నేడు మాజీ AVSOని చంపేసి బలవన్మరణం అని YCP ప్రచారం చేస్తోంది’ అని TDP ఆరోపించింది.
News November 14, 2025
వివాహం గురించి వేదాలేమంటున్నాయి?

పెళ్లంటే నూరేళ్ల పంట. వివాహం కుటుంబ వ్యవస్థకు ప్రధానమైన ఆధారం. ఇది గృహస్థాశ్రమ ధర్మానికి నాంది. మన మేధో వికాసానికి, సామాజిక ఎదుగుదలకు ఇది అత్యంత ముఖ్యమైనదని వేదాలు కూడా చెబుతున్నాయి. ఈ పవిత్ర వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచమంతా కొనియాడుతుంది. వివాహం ద్వారానే సంస్కృతికి, సమాజానికి పునాది పడుతుంది. అందుకే ఈ బంధాన్ని పవిత్రంగా గౌరవించాలి. ఈ బంధం రేపటి తరానికి ఉత్తమమైన వారసత్వాన్ని అందిస్తుంది. <<-se>>#Pendli<<>>


