News March 27, 2025
అమిత్‌షాపై ప్రివిలేజ్ నోటీసు తిరస్కరించిన RS ఛైర్మన్

HM అమిత్ షాపై కాంగ్రెస్ ఇచ్చిన సభా హక్కుల తీర్మానం నోటీసును రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. సోనియా గాంధీపై ఆయన విమర్శల్లో తప్పేమీ లేదన్నారు. ‘కాంగ్రెస్ ప్రెసిడెంటుగా సోనియా గాంధీ విపత్తు నిధి డబ్బులను వాడుకున్నారు. PMNRF కమిటీలో PM, కాంగ్రెస్ Prez ఉండేలా అప్పటి PM నెహ్రూ ప్రకటించారు’ అని 1948 నాటి ప్రెస్ రిలీజును షా కోట్ చేశారు. దీనిని క్షుణ్ణంగా పరిశీలించానని ధన్‌ఖడ్ తెలిపారు.
Similar News
News April 1, 2025
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ AJFCM కోర్టు తీర్పునిచ్చింది. ఓ భూవివాదంలో ఆత్కూరు పీఎస్‌లో వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు ఆ కేసును న్యాయస్థానం విచారించింది. వాదోపవాదాల అనంతరం ఈ నెల 15 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ తీర్పు చెప్పింది.
News April 1, 2025
రైల్ రోకో కేసు కొట్టేయండి.. హైకోర్టుకు కేసీఆర్

TG: 2011, అక్టోబరు 15న సికింద్రాబాద్‌లో నిర్వహించిన రైల్ రోకోకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టేయాలని BRS అధినేత KCR హైకోర్టును కోరారు. KCR పిలుపు మేరకే రోకో జరిగినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా, ఘటన సమయంలో ఆయన అక్కడ లేరని కేసీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వాదనలు ఆలకించిన ధర్మాసనం.. ఫిర్యాదు చేసిన వ్యక్తికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
News April 1, 2025
ఆటో ఛార్జీకి రూ.30 అడిగేవాడు.. కానీ ఇప్పుడు: హర్కేశ్

నిన్న KKRపై డెబ్యూ మ్యాచ్‌లోనే అశ్వనీకుమార్(MI) 4 వికెట్లు తీయడంతో తండ్రి హర్కేశ్ ఉప్పొంగిపోతున్నారు. అతను బుమ్రా, స్టార్క్‌లా రాణించాలని కలలు కనేవాడని చెప్పారు. ట్రైనింగ్ ముగించుకుని రా.10కి ఇంటికొచ్చి ఉ.6కే అకాడమీకి సైకిల్‌పై వెళ్లేవాడని గుర్తుచేసుకున్నారు. ఒక్కోసారి ఆటోలో వెళ్లేందుకు ₹30 అడిగేవాడని, ఇప్పుడు వేలంలో ₹30L సాధించాడని తెలిపారు. దాంతో పలువురికి క్రికెట్ కిట్లు విరాళంగా ఇచ్చారన్నారు.