News March 27, 2025
పెదబయలు: అనారోగ్యంతో విద్యార్థిని మృతి

పెదబయలు మం. కులుభ గ్రామానికి చెందిన వసంత కుమారి వైజాగ్ KGH లో చికిత్స పొందుతూ మృతి చెందిందని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రజని గురువారం తెలిపారు. పెద్దగురువు ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఈనెల 22న ఫీట్స్ రావడంతో నిర్వాహకులు పాడేరు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్సకు KGHలో జాయిన్ చేశారు. లంగ్స్ ఇన్ఫెక్షన్‌తో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
Similar News
News September 15, 2025
ASF: మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్‌లో దరఖాస్తుల ఆహ్వానం

సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో వయోవృద్ధుల కోసం మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు సంక్షేమ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సెంటర్‌లో సేవలందించేందుకు సీనియర్ సిటిజన్ అనిసియేషన్, NGOల నుంచి దరఖాస్తు కోరడం జరుగుతుందన్నారు. అనుభవం కలిగిన వారు పూర్తి వివరాలతో ఈనెల 19లోపు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News September 15, 2025
NRPT: ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి: ఎస్పీ

నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ ప్రోగ్రాంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో అందిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫిర్యాదులను పరిశీలించి, చట్ట ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు.
News September 15, 2025
NRPT: ప్రజావాణికి 44 ఫిర్యాదులు

NRPT కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 44 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆమె అర్జీలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అధికారులు ఏ ఒక్క ఫిర్యాదును పెండింగ్‌లో పెట్టకుండా, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.