News March 25, 2024
కోటవాని చెరువులో యువకుడి డెడ్‌బాడీ

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట పరిధిలోని కోటవాని చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు. నిడమర్రు మండలం చిననిండ్రకొలనుకు చెందిన సాయి రమేష్ కొంతకాలంగా ఉంగుటూరు మండలం సీతారాంపురంలో ఉంటున్నారు. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నాడు. చెరువులో మృతదేహం తేలగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News March 22, 2026
పశ్చిమ గోదావరికి రెడ్ అలర్ట్

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వాతావరణ శాఖ ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.
News March 22, 2026
పశ్చిమ గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్

కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.30 కోట్లతో “మీ ఇంటికి – మీ డాక్టర్” సేవలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నాడు నరసాపురం మండలంలోని 18 గ్రామాల్లో ఈ మొబైల్ మెడికల్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ వ్యాన్‌లో డాక్టర్లు, నర్సుల బృందం నేరుగా గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. రెడ్ క్రాస్ సేవల విస్తరణలో భాగంగా మన జిల్లా ఈ ప్రాజెక్టుకు ఎంపికైంది.
News March 22, 2026
ప.గో: తినీ తినక కిస్తీలు కడుతున్నాం.. మా ఇళ్లు మాకు ఇవ్వండి!

సొంతింటి కల నెరవేరుతుందని ఏళ్లుగా ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది. దసరా, సంక్రాంతి, ఉగాది అంటూ గడువు పొడిగిస్తున్నారే తప్ప ఇళ్లను అప్పగించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తూ, మరోవైపు అద్దె ఇళ్ల భారం మోయలేక తిని తినక కాలం వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. తక్షణమే ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


