News March 27, 2025
కడప: 98 ఏళ్ల వయసులోనూ ఓటేసిన జడ్పీటీసీ

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ఓ స్ఫూర్తిదాయక దృశ్యం కనిపించింది. గురువారం కడప నగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఛైర్మన్ ఎన్నికలో ఉమ్మడి కడప జిల్లా గాలివీడు జడ్పీటీసీ షేక్ భానూ బీ 98ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలో ప్రతి ఓటు కీలకం అయిన నేపథ్యంలో ఆమె ఓటు వేసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
Similar News
News April 1, 2025
కర్నూలు: టెన్త్ పరీక్షలకు 430 మంది గైర్హాజరు- డీఈఓ

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో మంగళవారం 430 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారైనట్లు డీఈఓ శామ్యూల్ పాల్ తెలిపారు. రెగ్యులర్ విధానంలో 293 మంది ఉండగా, ప్రైవేట్ విధానంలో 137 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 31,990 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోలేదన్నారు.
News April 1, 2025
తెలంగాణ కాంగ్రెస్ ఫ్లెక్సీలో YS జగన్ ఫొటో

TG: నల్గొండలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోను ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. సన్నబియ్యం పంపిణీకి వస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వాగతం పలుకుతూ దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
News April 1, 2025
లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ

రేపు లోక్‌సభ సమావేశానికి అందరూ హాజరుకావాలని తమ MPలకు బీజేపీ, కాంగ్రెస్ అధిష్ఠానాలు విప్ జారీ చేశాయి. లోక్‌సభలో కేంద్రం రేపు వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఎంపీలందరూ కచ్చితంగా రావాలని బీజేపీ అధిష్ఠానం చెప్పినట్లు సమాచారం. అటు కాంగ్రెస్ కూడా బిల్లుపై తీవ్ర నిరసనలు తెలిపే అవకాశం ఉంది.