News March 27, 2025

విశాఖ మేయర్ పీఠంపై ‘యాదవుల’ పట్టు..!

image

జీవీఎంసీ మేయర్‌గా గొలగాని హరి వెంకట కుమారిని కొనసాగించాలని విశాఖ జిల్లా యాదవ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, ఆ స్థానాన్ని యాదవులకే ఇవ్వాలన్నారు. జీవీఎంసీలో 22 మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఉన్నారన్నారు. ఏ సామాజిక వర్గంలో ఇంత మంది కౌన్సలర్లు లేరని గుర్తుచేశారు. 

Similar News

News April 1, 2025

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దీక్షకు నాలుగేళ్లు

image

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ దీక్షా శిబిరం ఏర్పాటు చేసి మంగళవారం నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ అర్ధనగ్న ప్రదర్శన, ధర్నా స్టీల్ ప్లాంట్‌ని సెయిల్‌లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

News April 1, 2025

విశాఖలో చిన్నారులతో భిక్షాటన

image

విశాఖలో చిన్నపిల్లలతో భిక్షాటన చేయించడం రోజురోజుకు ఎక్కువ అవుతోంది. మరికొందరు ఒడిలో నెలల పిల్లలను పెట్టుకుని మరీ ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ వద్ద భిక్షాటన చేస్తున్నారు. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో చిన్నపిల్లలు సొమ్మసిల్లుతున్న పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా లంకెలపాలెం, అగనంపూడి, గాజువాక వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

News April 1, 2025

ఈనెల 3వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్‌: విశాఖ డిఈవో

image

జ్ఞానాపురంలోని సోఫియా జూనియర్ కళాశాలలో ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు డిఈవో ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లోకి సెల్ ఫోన్లు అనుమతించబోమని తెలిపారు. ఉపాధ్యాయుల కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 900 మంది ఉపాధ్యాయులు, అధికారులు విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.

error: Content is protected !!