News March 27, 2025

రాఘవపూర్‌: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపురం గ్రామ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఒకే వైపు వెళుతున్న ట్యాంకర్ లారీ ఢీకొన్నట్లు ఈ ఘటనలో రాకేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News July 5, 2025

మరో రెండు రోజులు గోదావరి వరద ఉద్ధృతి

image

గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. మరో రెండు రోజులు వరద ప్రవాహం ఇదే తరహాలో ఉంటుందని గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. సీలేరుతో కలిపి శనివారం గోదావరి ఇన్‌ఫ్లో 1,70,929 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. 3 డెల్టాలకు సాగునీటి అవసరాల నిమిత్తం 12,100 క్యూసెక్కులు విడిచిపెడతామన్నారు. మిగిలిన 1,60,218 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలనున్నట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News July 5, 2025

మహబూబ్ నగర్: IIIT.. టాప్ విద్యార్థులు వీళ్లే!

image

మహబూబ్‌నగర్‌లో IIIT క్యాంపస్ నూతనంగా ఏర్పాటు చేశారు. నిన్న విడుదల చేసిన క్యాంపస్ ఎంపిక ఫలితాల్లో హర్షిత(574) సంగారెడ్డి, నిహారిక(572) నారాయణపేట, శ్రీవిద్య(570) నిజామాబాద్, హాజీబేగం(569) సంగారెడ్డి, మొహమ్మద్‌ గులాం సాధిక్‌(568) జనగామ టాపర్లుగా నిలిచారు. ఉమ్మడి జిల్లాల్లో
MBNR-20, NGKL-21, GDWL-6, WNPT-4, NRPT-15 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.

News July 5, 2025

న్యూడ్ వీడియోలతో బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్

image

విశాఖ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి న్యూడ్ వీడియో కాల్ చేయించుకొని రికార్డ్ చేశాడు. ఈ వీడియోలు ఆమె తల్లికి పంపి డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధిత మహిళ సీపీ శంఖబ్రత బాగ్చీని ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేసి బెదిరిస్తున్న వ్యక్తి కర్నూల్‌ జిల్లా వాసిగా గుర్తించారు. అతడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.