News March 27, 2025

సిద్దిపేట: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు వద్దు: CP

image

జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని సిద్దిపేట సీపీ డాక్టర్ బి.అనురాధ సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 13 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, ధర్నాలు చేపట్టవద్దన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News March 5, 2026

కొత్తగూడకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల..?

image

కొత్తగూడ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక చదువు మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం జూన్ మాసం నుంచే విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

News March 5, 2026

వనపర్తి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసి విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామన్నారు. గ్రామ, పట్టణాల్లో ప్రజలకు లబ్ధి చేకూర్చిన సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు.

News March 5, 2026

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

image

ఏపీలో పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. <>https://bse.ap.gov.in/<<>> సైట్ లేదా మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009, లీప్ యాప్‌‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వెబ్‌సైట్ సర్వర్ బిజీగా ఉండటంతో వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.