News March 27, 2025

కన్నడిగులకు మరో షాక్!

image

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పాల ధరలను లీటరుకు రూ.4 పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మిల్క్ ధరలను లీటరుకు రూ.5 పెంచాలని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) కోరగా సీఎం సిద్దరామయ్య రూ.4 పెంచేందుకు అంగీకరించారు. ఇటీవలే అక్కడ కరెంట్ ఛార్జీలను పెంచారు. 6 గ్యారంటీలే ధరల పెరుగుదలకు కారణమని విపక్షాలు మండిపడుతున్నాయి.

Similar News

News April 1, 2025

IPL: టాస్ గెలిచిన పంజాబ్

image

లక్నోలో జరుగుతున్న LSGvsPBKS మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

జట్లు ఇవే:
PBKS: ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్, శశాంక్, శ్రేయస్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, సూర్యాన్ష్, జాన్సెన్, చాహల్, ఫెర్గుసన్, అర్షదీప్
LSG: మార్ష్, మార్క్‌రమ్, పూరన్, పంత్, బదోనీ, మిల్లర్, సమద్, దిగ్వేశ్, శార్దూల్, బిష్ణోయ్, ఆవేశ్

News April 1, 2025

CBN, లోకేశ్, పవన్‌పై వైసీపీ ‘ఏప్రిల్ ఫూల్’ ట్వీట్

image

AP: ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా చంద్రబాబుకు డబ్బు కట్ట, లోకేశ్‌కు పాల డబ్బా, పవన్‌కు రిమోట్‌ను సింబల్స్‌గా పెట్టి వైసీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘వెరీ ఫేమస్ పాత్రలు.. స్కామర్ బాబు, పప్పు లోకేశ్, పవన్ కంట్రోల్. ఇప్పుడు మీ సమీపంలోని హెరిటేజ్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ ఫూల్ కోడ్‌ను ఉపయోగించి 50 శాతం డిస్కౌంట్ పొందండి. లేదా TDPFools కోడ్‌తో 100% తగ్గింపును పొందండి’ అని రాసుకొచ్చింది.

News April 1, 2025

దోమలు ఎక్కువగా ఎవరిని కుడతాయంటే?

image

దోమలు అందరిపై ఒకేలా దాడి చేయవు. ఎందుకంటే వాటికీ ఓ టేస్ట్ ఉంది. దోమలు ‘O’ గ్రూప్ రక్తాన్ని ఎక్కువగా ఇష్టపడతాయని ఓ పరిశోధనలో తేలింది. అందుకే O గ్రూప్ వ్యక్తులను ఎక్కువగా, A రకం వాళ్లని తక్కువగా కుడతాయి. అలాగే, చర్మంపై ఉండే బ్యాక్టీరియా కూడా కీలకం. అవి చెమటతో కలిసినప్పుడు విడుదల చేసే వాసన దోమలను ఆకర్షించడమో, తిప్పికొట్టడమో చేస్తుంటాయి. గర్భిణులు, వ్యాయామం చేసే వారిపై దోమల ప్రభావం ఎక్కువ అని తేలింది.

error: Content is protected !!