News March 27, 2025

మంచిర్యాల: ఈ నెల 28న మినీ జాబ్ మేళా

image

మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న ఉదయం10.30గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. అపోలో ఫార్మసీ మంచిర్యాల, గోదావరిఖని, హైదరాబాద్‌లో ఫార్మసిస్ట్ 40, ట్రైనింగ్ ఫార్మాసిస్ట్ 20, ఫార్మసీ అసిస్టెంట్30, రిటైల్ ట్రైనీ అసిస్టెంట్10ఖాళీలు ఉన్నాయన్నారు.18నుంచి 35లోపు వయస్సు, అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 1, 2025

IPL బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి: BHPL ఎస్పీ

image

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, IPL బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే IPL క్రికెట్ బెట్టింగ్స్ వల్ల యువత ఆర్థికంగా దెబ్బతిని చివరికి సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని తెలిపారు. బెట్టింగ్ నిర్వహించే వారిపై పోలీస్ నిఘా ఏర్పాటు చేశామన్నారు.

News April 1, 2025

బెట్టింగ్ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: BHPL ఎస్పీ

image

బెట్టింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం అన్నారు. యువత, విద్యార్థులు, అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, ఐపీఎల్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి బెట్టింగ్ సంబంధిత సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.

News April 1, 2025

చిత్తూరు: టెన్త్ పరీక్షలకు 191 మంది గైర్హాజరు

image

చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన 10వ తరగతి సోషల్ పరీక్షకు 191 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. మొత్తం 118 పరీక్షా కేంద్రాల్లో 20,893 మంది విద్యార్థులకు గాను 20,702 మంది పరీక్షలు రాశారని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 31 పరీక్ష కేంద్రాలను చెక్ చేసిందన్నారు. 57 మంది సిట్టింగ్ స్క్వాడ్లు విధులు నిర్వహించారన్నారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని స్పష్టం చేశారు.

error: Content is protected !!