News March 27, 2025
IT కంపెనీలు, ఉద్యోగులకు Shocking News

దేశీయ IT కంపెనీలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. పరిశ్రమ మొత్తం ఫోకస్‌ను మరోవైపు షిప్ట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కస్టమర్లు తమ ప్రాజెక్టుల డెడ్‌లైన్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 60% ప్రాజెక్టుల్లో కోత తప్పదని Forrester తెలిపింది. గతంలో 3-5 ఏళ్లు తీసుకున్న ప్రాజెక్టులను 18 నెలల్లోనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది. ఇది కంపెనీల ప్రాఫిట్, ఉద్యోగుల ఉపాధికి గండి కొట్టనుంది.
Similar News
News April 1, 2025
ఇళ్ల నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయం: ప్రభుత్వం

AP: SC, ST, BC, ఆదివాసీ గిరిజనుల(PVTG) వర్గాల లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో అసంపూర్తిగా ఉన్నవాటి నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయాన్ని కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘మారిన ఖర్చుకు తగిన విధంగా ఎస్సీలకు రూ.50వేలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నాం’ అని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ MD రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
News April 1, 2025
TTD పనితీరు అస్తవ్యస్తం.. చర్యలు తీసుకోండి: PMకు ఎంపీ లేఖ

AP: తిరుమలలో భద్రతా వైఫల్యాలపై జోక్యం చేసుకోవాలంటూ PM మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు YCP MP గురుమూర్తి లేఖ రాశారు. ‘వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. అన్నదానం క్యూకాంప్లెక్స్‌లోనూ తొక్కిసలాట జరిగింది. కొండపైకి మాంసం, మద్యం తీసుకెళ్తున్నారు. పాపవినాశనం డ్యామ్‌లో నిబంధనలకు విరుద్ధంగా బోట్లు తిప్పారు. TTD పనితీరు అస్తవ్యస్తంగా మారింది. ఈ ఘటనలపై చర్యలు తీసుకోండి’ అని కోరారు.
News April 1, 2025
మా ప్రభుత్వం రూ.వేల కోట్ల భూమిని కాపాడింది: భట్టి

TG: కంచ గచ్చిబౌలిలోని ₹వేల కోట్ల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తాము కాపాడామని Dy.CM భట్టి తెలిపారు. ‘400 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం 2004లో IMG భారత్‌కు కేటాయిస్తే, 2006లో YSR ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో IMG భారత్ కోర్టుకు వెళ్లింది. అప్పటినుంచి కేసు కోర్టులోనే ఉంది. పదేళ్లుగా BRS కూడా పట్టించుకోలేదు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని చూసింది’ అని ఆరోపించారు.