News March 25, 2024
నిజామాబాద్: పడిపోయిన పసుపు ధరలు

నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అల్‌టైం రికార్డు ధర పలికిన పసుపు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. పది రోజుల క్రితం గరిష్ఠంగా రూ.18,299 పలికిన పసుపు రూ.1,500 వరకు తగ్గడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం మార్కెట్‌లో పసుప ధర గరిష్ఠంగా క్వింటాలుకు రూ.16,666 ఉంది. దానికి తోడు ఈ నెలాఖరు వరకు రెండు రోజులు మాత్రమే పసుపు కొనుగోళ్లు సాగుతాయని మార్కెట్ అధికారులు వెల్లడించారు.
Similar News
News April 1, 2026
నిజామాబాద్: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.
News April 1, 2026
నిజామాబాద్: అకాల వర్షంతో అన్నదాత విలవిల

నిజామాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి, మొక్కజొన్న పంటలు నేలకొరగగా.. మామిడి కాయలు రాలిపోయాయి. జిల్లావ్యాప్తంగా 76 గ్రామాల్లో సుమారు 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ముఖ్యంగా నవీపేట్, భీమ్‌గల్ మండలాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.