News March 27, 2025
పంగులూరు: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని మందలించడంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పంగులూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బుధవాడ గ్రామానికి చెందిన ప్రవల్లిక అనే అమ్మాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివింది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని ఇంట్లో వాళ్లు మందలించడంతో మనస్థాపన చెంది, బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 1, 2025
2029కి రూ.50వేల కోట్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: రాజ్‌నాథ్

FY2025లో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.23,622 కోట్లకు చేరినట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. FY24తో(రూ.21,083 కోట్లు) పోలిస్తే 12.04 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. ఈ విజయంలో భాగమైన అందరికీ అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంలో 2029 నాటికి రక్షణ ఎగుమతులను రూ.50వేల కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిఫెన్స్ రంగంలో ఇది గర్వించదగ్గ మైలురాయి అని PM కొనియాడారు.
News April 1, 2025
కడపలో హిజ్రాల ఆందోళన

పదేళ్లుగా హిజ్రాతో సహజీవనం చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హిజ్రాలు కోరారు. ఈ మేరకు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు 50మందికి పైగా హిజ్రాలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సీఐ రామకృష్ణ జోక్యం చేసుకుని విచారించి న్యాయం చేస్తామన్నారు. ఆయన హామీతో హిజ్రాలు ఆందోళన విరమించారు.
News April 1, 2025
ఇళ్ల నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయం: ప్రభుత్వం

AP: SC, ST, BC, ఆదివాసీ గిరిజనుల(PVTG) వర్గాల లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో అసంపూర్తిగా ఉన్నవాటి నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయాన్ని కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘మారిన ఖర్చుకు తగిన విధంగా ఎస్సీలకు రూ.50వేలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నాం’ అని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ MD రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు.