News March 27, 2025

ఏప్రిల్ 1: మారేవి ఇవే

image

ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
* రూ.12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ లేదు
* టీడీఎస్, టీసీఎస్ పరిమితుల్లో మార్పులు
* SBI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రివార్డుల్లో సవరణలు
* ఇన్‌యాక్టివ్ లేదా ఇతరులకు కేటాయించిన మొబైల్ నంబర్లకు నిలిచిపోనున్న యూపీఐ సేవలు

Similar News

News April 1, 2025

2029కి రూ.50వేల కోట్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: రాజ్‌నాథ్

image

FY2025లో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.23,622 కోట్లకు చేరినట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. FY24తో(రూ.21,083 కోట్లు) పోలిస్తే 12.04 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. ఈ విజయంలో భాగమైన అందరికీ అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంలో 2029 నాటికి రక్షణ ఎగుమతులను రూ.50వేల కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిఫెన్స్ రంగంలో ఇది గర్వించదగ్గ మైలురాయి అని PM కొనియాడారు.

News April 1, 2025

ఇళ్ల నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయం: ప్రభుత్వం

image

AP: SC, ST, BC, ఆదివాసీ గిరిజనుల(PVTG) వర్గాల లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో అసంపూర్తిగా ఉన్నవాటి నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయాన్ని కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘మారిన ఖర్చుకు తగిన విధంగా ఎస్సీలకు రూ.50వేలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నాం’ అని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ MD రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

News April 1, 2025

TTD పనితీరు అస్తవ్యస్తం.. చర్యలు తీసుకోండి: PMకు ఎంపీ లేఖ

image

AP: తిరుమలలో భద్రతా వైఫల్యాలపై జోక్యం చేసుకోవాలంటూ PM మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు YCP MP గురుమూర్తి లేఖ రాశారు. ‘వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. అన్నదానం క్యూకాంప్లెక్స్‌లోనూ తొక్కిసలాట జరిగింది. కొండపైకి మాంసం, మద్యం తీసుకెళ్తున్నారు. పాపవినాశనం డ్యామ్‌లో నిబంధనలకు విరుద్ధంగా బోట్లు తిప్పారు. TTD పనితీరు అస్తవ్యస్తంగా మారింది. ఈ ఘటనలపై చర్యలు తీసుకోండి’ అని కోరారు.

error: Content is protected !!