News March 27, 2025

సిరిసిల్ల: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట కృష్ణనాయక్ తండాకు చెందిన శివరాత్రి సాయి కృష్ణ (17) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొండగట్టు ఆంజన్నను దర్శించుకుని తిరిగి వస్తుండగా ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోడ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో టాప్‌పై కూర్చున్న సాయి కృష్ణ కింద పడటంతో పైనుండి ఆటో వెళ్ళింది. ఈ ప్రమాదంలోసాయి కృష్ణ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 1, 2025

కర్ణాటకలో డీజిల్ ధర పెంపు

image

కర్ణాటకలో డీజీల్ ధరలు పెరగనున్నాయి. డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం 21.7% శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లీటరు డీజీల్ ధర ₹2 పెరిగి ₹91.02కి చేరుకోనుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే బెంగళూరులో ఇవాళ్టి నుంచి చెత్త పన్ను కూడా వసూలు చేయనుంది. నివాస భవనాల విస్తీర్ణాన్ని బట్టి నెలకు ₹10 నుంచి ₹400 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

News April 1, 2025

2029కి రూ.50వేల కోట్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: రాజ్‌నాథ్

image

FY2025లో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.23,622 కోట్లకు చేరినట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. FY24తో(రూ.21,083 కోట్లు) పోలిస్తే 12.04 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. ఈ విజయంలో భాగమైన అందరికీ అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంలో 2029 నాటికి రక్షణ ఎగుమతులను రూ.50వేల కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. డిఫెన్స్ రంగంలో ఇది గర్వించదగ్గ మైలురాయి అని PM కొనియాడారు.

News April 1, 2025

కడపలో హిజ్రాల ఆందోళన

image

పదేళ్లుగా హిజ్రాతో సహజీవనం చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హిజ్రాలు కోరారు. ఈ మేరకు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు 50మందికి పైగా హిజ్రాలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సీఐ రామకృష్ణ జోక్యం చేసుకుని విచారించి న్యాయం చేస్తామన్నారు. ఆయన హామీతో హిజ్రాలు ఆందోళన విరమించారు.

error: Content is protected !!