News March 27, 2025
బట్టతల వల్ల పెళ్లి కావట్లేదని డాక్టర్ సూసైడ్

TG: బట్టతల కారణంగా పెళ్లి రద్దు కావడంతో మనస్తాపం చెంది ఓ MBBS వైద్యుడు HYDలో సూసైడ్ చేసుకున్నారు. అల్వాల్ బస్తీ దవాఖానాలో పురోహిత్ కిశోర్(34) వైద్యుడిగా పని చేస్తున్నారు. ఇటీవల అతనికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత కిశోర్‌కు బట్టతల ఉండటం, ఇతరత్రా కారణాలతో పెళ్లి రద్దైంది. వయసు మీరినా వివాహం కావట్లేదని బొల్లారం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి అతడు ఆత్మహత్య చేసుకున్నారు.
Similar News
News November 12, 2025
SBIలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

<
News November 12, 2025
జల సంరక్షణలో తెలంగాణ నంబర్-1

జాతీయ జల అవార్డులు-2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ(ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ) విభాగంలో TG ఫస్ట్ ర్యాంక్ సాధించింది. 5,20,362 పనులు పూర్తిచేసి ఈ ఘనత సాధించింది. జిల్లాల్లో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల టాప్‌లో నిలిచాయి. ఇదే కేటగిరీ మున్సిపల్ విభాగంలో రాజమండ్రి(AP) 4వ ర్యాంకు సాధించింది. దీంతో ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల నగదు బహుమతి రానుంది. ఈ నెల 18న రాష్ట్రపతి ముర్ము పురస్కారాలను అందజేస్తారు.
News November 12, 2025
సీరం వాడుతున్నారా?

చర్మ సంరక్షణలో సీరం కీలకపాత్ర పోషిస్తుంది. మీకున్న చర్మ సమస్యకు తగిన సీరం ఎంచుకోవడం ముఖ్యం. విటమిన్ సి సీరం వృద్ధాప్య ఛాయల్ని, హ్యాలురోనిక్ యాసిడ్ ఉన్న సీరం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ముఖంపై ముడతలు ఉంటే రెటినాల్ సీరం, కాలుష్యం వల్ల దెబ్బతిన్న చర్మానికి బీటా కెరొటిన్, గ్రీన్ టీ, బెర్రీలు, దానిమ్మ, ద్రాక్ష గింజల సారం ఉన్న సీరం మంచిది. సున్నిత చర్మం ఉంటే యాంటీఇన్ఫ్లమేటరీ సీరం ఎంచుకోవాలి.


