News March 27, 2025
ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఒంగోలులోని భాగ్యనగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను గురువారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సందర్శించారు. ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించాలి. కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 2, 2025
దివావకరపల్లిలో మంత్రి నారా లోకేశ్ పర్యటన సాగేదిలా

పెదచెర్లపల్లి మండలం దివాకరపల్లిలో మంత్రి నారా లోకేశ్ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌కు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉదయం 7:15 నిమిషాలకు ఉండవల్లి నుంచి బయలుదేరుతారు. 9:15కు దివాకరపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9: 25 నిమిషాలకు బయోగ్యాస్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11:45 వరకు సభలో పాల్గొంటారు. 11:55 నిమిషాలకు అక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు.
News April 1, 2025
ప్రకాశం: పింఛన్ నగదు మాయం

పింఛన్ నగదు మాయం కావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లిక మార్కాపురంలోని బ్యాంక్‌లో శనివారం పింఛన్ నగదు రూ.15.38 లక్షలు విత్ డ్రా చేశారు. ఆటోలో వస్తుండగా పింఛన్ నగదు మాయమైంది. ఈ మేరకు ఆమె మార్కాపురం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సంబంధిత సచివాలయం వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు.
News April 1, 2025
పెదచెర్లోపల్లి: అధికారులతో కలెక్టర్ సమీక్ష

పెద చెర్లోపల్లి మండలంలో దివాకరపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పర్యటించారు. గ్రామంలో బుధవారం రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపనకు మంత్రి నారా లోకేశ్, అనంత్ అంబానీలు వస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఉగ్రతో కలసి ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమానికి తరలి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.