News March 27, 2025
జగ్జీవన్ రామ్, అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

ఏప్రిల్-5న బాబు జగ్జీవన్ రావు, ఏప్రిల్-14న డా.బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వర్తించే కార్యక్రమాలపై జిల్లాలోని వివిధ దళిత సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
Similar News
News November 15, 2025
CII సదస్సు.. 13 లక్షల ఉద్యోగాలు: రాష్ట్ర ప్రభుత్వం

AP: సీఐఐ సదస్సులో తొలి రోజు 365 సంస్థలతో రూ.8,26,668 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సమ్మిట్ ముందు రోజుతో కలిపి 400 MoUలు, రూ.11,99,971 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని పేర్కొంది. దీంతో 13,32,445 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులు పెట్టుకున్న విశ్వాసాన్ని మరోసారి రుజువుచేసిందని తెలిపింది.
News November 15, 2025
పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండకూడదు: కలెక్టర్ సిరి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్లు కాకుండా చూడాలని, పిల్లలను వలసలకు తీసుకెళ్లే తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డీఈఓ, ఎంఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.
News November 15, 2025
కలియుగ ధర్మ సూత్రమిదే..

ఈ కలియుగంలో నీ గతం ఎంత గొప్పదైనా నీవు చేసిన ఒక్క తప్పును జనం చెడుగానే పరిగణిస్తారు. వంద మంచి పనులు చేసినా, ఒక చిన్న లోపం కనిపిస్తే, లోకం నిన్ను చెడ్డవానిగా ముద్రవేస్తుంది. అదేవిధంగా నీ గతం ఎంత చెడ్డదైనా, చిత్తశుద్ధితో చేసిన ఒక్క మంచి పని అయినా నిన్ను మంచివానిగా నిలబెట్టగలదు. అందుకే జనాభా అభిప్రాయాలకు లొంగకుండా, వర్తమానంలో ధర్మాన్ని ఆచరించడమే నిజమైన జీవిత నిబంధనగా ముందుకు సాగాలి.


