News March 27, 2025

వరంగల్: మరమ్మత్తుల కారణంగా చర్లపల్లి వరకే కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు

image

కృష్ణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లడం లేదని రైల్వే జీయం అరుణ్ కుమార్ జైన్ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, కొన్ని మరమ్మత్తుల కారణంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకే పరిమితం చేశామని, సికింద్రాబాద్‌కు పోవు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు గమనించి, సహకరించాల్సిందిగా వారు కోరారు.

Similar News

News November 6, 2025

వీరుల రక్తపు ధారలు ప్రవహించిన పల్నాడు

image

నాటి వీరులు వాడిన ఆయుధాలనే దేవతలుగా పూజించే ఆచారం పల్నాడు జిల్లా కారంపూడిలో ఉంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పోతురాజుకు పడిగం కట్టి పల్నాటి వీరుల ఉత్సవాలకు పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ్ శ్రీకారం చుట్టారు. ఈ నెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. మినీ మహాభారతంగా, ఆంధ్ర కురుక్షేత్రంగా పిలవబడే పల్నాటి యుద్ధ సన్నివేశాలను ఈ ఉత్సవాలలో నిర్వహిస్తారు.

News November 6, 2025

ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి అచ్చెన్న

image

రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఉల్లి ధ‌ర‌లు ప‌త‌న‌మైన‌ప్పుడు రైతులు పడిన శ్రమ వృథా కాకుండా ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేసింది. రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా రక్షించాలనే భావనతో సీఎం చంద్ర‌బాబు కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు.

News November 6, 2025

నియోనాటల్‌ పీరియడ్‌ కీలకం

image

బిడ్డ పుట్టిన మొదటి 28 రోజులు చాలా క్లిష్టమైన సమయం. దీన్ని నియోనాటల్‌ పీరియడ్‌ అంటారు. ఈ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా శిశువు ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. నియోనాటల్‌ పీరియడ్‌‌లో బిడ్డకు అనారోగ్యాల ముప్పు తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహించడానికి స్పెషల్‌ కేర్‌ అవసరం. బిడ్డను వెచ్చగా ఉంచడం, శ్వాసక్రియ సరిగా ఉండేలా చూడటం, తల్లిపాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటం ముఖ్యమని చెబుతున్నారు.