News March 27, 2025
వారిని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కృషి: కేంద్రమంత్రి రామ్మోహన్

ఆంధ్రప్రదేశ్‌లోని శిష్టకరణం, కళింగ కోమటి, తూర్పు కాపు, సోండీ, అరవల కులాలను కేంద్రీయ వెనుకబడిన వర్గాల (ఓబీసీ) జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్‌కి సిఫారసు చేశారు. గురువారం కేంద్ర సామాజిక న్యాయ శాఖామంత్రి వీరేంద్ర కుమార్‌తో భేటీ అయి వినతి పత్రం సమర్పించారు. వీరిని ఓబీసీలో చేర్చే విషయాన్ని పరిశీలించాలన్నారు.
Similar News
News February 21, 2026
ఆమదాలవలస: అస్వస్థతకు గురై ప్రయాణికుడు మృతి

శ్రీకాకుళం నుంచి పాలకొండకు బస్సులో వెళ్తున్న ప్రయాణికుడు శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. చింతాడ వద్ద బస్సును ఆపి తోటివారు, సిబ్బంది 108కు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్ అక్కడికి చేరుకొని ప్రయాణికుడిని 108 సిబ్బంది పరీక్షించగా అప్పటికే మృతి చెందాడు. గుండెపోటుతో మరణించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 21, 2026
ఎచ్చెర్ల: ఫలితాలు విడుదల

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు యూజీ పరీక్షల విభాగం డీన్ ఎం. అనురాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీబీ, సీఏ. బీబీఏ, బీటెక్ పరీక్షలు సంబంధించి రిజల్ట్ యూనివర్సిటీ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తామని, వర్సిటీ వెబ్‌సైట్ ఫలితాలను విద్యార్థులు చూడవచ్చని అన్నారు.
News February 21, 2026
శ్రీకాకుళం: మహిళ పొట్ట నుంచి 3.3 కిలోల కణితి తొలగింపు

కడుపు నొప్పితో బాధపడుతూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి శనివారం వచ్చింది. పరీక్షించిన వైద్యులు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం శస్త్ర చికిత్స చేసి 3.3 కిలోల కణితిని ఆ మహిళ పొట్ట నుంచి బయటకు తీశారు. పేషంట్ పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారని, అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేశామన్నారు.


