News March 27, 2025

బాపట్ల జిల్లాలో ముమ్మరంగా వాహన తనిఖీలు

image

బాపట్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. గురువారం బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలలో నిషేధిత వస్తువులు తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News November 7, 2025

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పీలేరు మండలం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఆసుపత్రికి సంబంధించి ఓపీ రిజిస్టర్, డిస్పెన్సరీ రిజిస్టర్లను పరిశీలించారు. చిన్నపిల్లలకు టీకాలు ఎప్పుడు ఎప్పుడు వేస్తున్నారు వంటి సమాచారాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News November 7, 2025

మనందరికీ చారిత్రకమైన సందర్భం: పాడేరు ఎస్పీ

image

వందేమాతరం గీతం 150వ ఏడాది వేడుకలు మనందరికీ చారిత్రకమైన సందర్భమని ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. ఈ గీతం ద్వారా దేశభక్తిని వ్యక్తం చేయడం మనకు గర్వకారణమైన అనుభవమన్నారు. గేయం స్ఫూర్తితో అన్ని విభాగాల పోలీస్ సిబ్బంది కలిసి పని చేయడం చాలా ముఖ్యమన్నారు. వందేమాతరం గీతం 150వ ఏడాది వేడుకల సందర్భంగా శుక్రవారం పాడేరు ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వందేమాతరం ఆలపించారు.

News November 7, 2025

రాష్ట్ర ప్రజల ప్రార్థనల వల్లే విశ్వవిజేతగా నిలిచాం: శ్రీచరణి

image

రాష్ట్ర ప్రజల మద్దతు, ప్రార్థనల వల్లే ఇండియా ఉమెన్స్ టీమ్ విశ్వవిజేతగా నిలిచిందని ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ శ్రీచరణి అన్నారు. మంగళగిరిలో శుక్రవారం ఆమె మాట్లాడారు. తనకు రూ. 2.5 కోట్ల నగదు, గ్రూప్-1 ఉద్యోగం, కడపలో 1000 గజాల స్థలం కేటాయించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని చిన్నికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.