News March 27, 2025

సంగారెడ్డి: ‘అంబేడ్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి’

image

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతిని అన్ని గ్రామాలు, పట్టణాల్లో అధికారికంగా నిర్వహించాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ మాధురికి గురువారం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం మాట్లాడుతూ.. గ్రామాల్లో జరిగే అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు హాజరయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. జిల్లా కార్యదర్శి అశోక్ ఉపాధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు.

Similar News

News September 18, 2025

పోషకాహారంతో ఆరోగ్యమే మహాభాగ్యం: KMR కలెక్టర్

image

సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని KMR కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. లింగంపేట మండలం పోతాయిపల్లిలో జరిగిన ‘స్వచ్ఛతా హీ సేవ-2025’, ‘పోషక్ అభియాన్’ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ‘పోషక్ అభియాన్’ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో పోషక మాసం నిర్వహిస్తూ పౌష్టికాహారం విలువను తెలియజేస్తున్నామన్నారు.

News September 18, 2025

ప్రతి విద్యార్థి లక్ష్యం కోసం పట్టుదలతో చదవాలి: కలెక్టర్

image

ప్రతి విద్యార్థి తాము ఎంచుకున్న లక్ష్యం కోసం పట్టుదలతో చదివి సాధించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం పరకాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో తరగతి గదులు, కిచెన్, డార్మేట్రి, పరిసరాలను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు.

News September 18, 2025

NZB: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో వృద్ధురాలి శవం

image

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గుర్తించారు. శవం ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.