News March 25, 2024

బొబ్బిలి ఎమ్మెల్యేపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు 

image

బొబ్బిలి MLAపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదయ్యింది. అనుమతులు లేకుండా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుతో పాటు మరికొంత మంది వైసీపీ నాయకులపై ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిత్రకోట, బొడ్డవలస పంచాయతీలోని ఎంసీసీ కోడ్‌కు వ్యతిరేకంగా పార్టీ ప్రచారం చేస్తున్నారన్న అభియోగంపై ఏఆర్‌ఓ, RDO సాయి శ్రీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు S.I తెలిపారు.

Similar News

News February 10, 2026

VZM: పాము కాటుతో వ్యక్తి మృతి

image

సంతకవిటి మండలం సిరిపురం పంచాయతీ యాగాటిపేటకి చెందిన రైతు సిరి ఆనందరావు (50) పాము కాటుకు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆనందరావు సోమవారం తన పొలంలో మినప చేనును ఇంటికి తీసుకువస్తుండగా దారిలో పాము కాటేసింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలియజేయగా వారు 108కు సమాచారం ఇవ్వడంతో పొందూరు ప్రభుత్వ ఆసుపత్రి లో చేర్చారు. మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News February 10, 2026

విజయనగరం సబ్‌డివిజన్‌లో సెక్షన్ 30 అమలు: DSP

image

విజయనగరం సబ్ డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 10 నుంచి మార్చి 11 వరకు సెక్షన్ 30 పోలీసు చట్టం అమలులో ఉంటుందని ఇన్ఛార్జి DSP గోవిందరావు సోమవారం తెలిపారు. పోలీసు శాఖ అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసనలు నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. కార్యక్రమాల కోసం ముందుగా DSP కార్యాలయంలో దరఖాస్తు చేసి అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.