News March 27, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>కొయ్యూరు జడ్పీటీసీ నుంచి పీవీటీజీలకు రక్షణ కల్పించాలి
>పాడేరు: పాఠశాలల్లో మూడుసార్లు వాటర్ బెల్
>పెదబయలు: అనారోగ్యంతో విద్యార్థిని మృతి
>హుకుంపేట: విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి
>రంప: ఆ గ్రామంలో చింతపండు ఉచితం
>పాడేరు: హాజరు, నోట్ కామ్‌లో నమోదు చేయండి
>దేవీపట్నం: వేతన జీవుల పిల్లలకు ఉపాధి కల్పన
Similar News
News November 6, 2025
అనకాపల్లి: ఈ నెల 11 నుంచి క్రీడల ఎంపిక పోటీలు

సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడల ఎంపిక పోటీలు ఈనెల 11 నుంచి 13 వరకు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం, షుగర్ ఫ్యాక్టరీ గ్రౌండ్, పరవాడ ఇండోర్ స్టేడియం, అనకాపల్లి జార్జ్ క్లబ్ వద్ద నిర్వహించనున్నారు. ఈ వివరాలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పూజారి శైలజ గురువారం వెల్లడించారు. ఈ పోటీల్లో ఎంపికైన వారు ఈనెల 19 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
News November 6, 2025
ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ మృతి

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అనునయ్ సూద్(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ఇన్‌స్టాలో వెల్లడించారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. నోయిడాకు చెందిన అనునయ్ దుబాయ్‌లో ట్రావెల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 46 దేశాల్లో పర్యటించిన ఆయనకు ఇన్‌స్టాలో 14L, యూట్యూబ్‌లో 3.80L మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022, 23, 24లో ఫోర్బ్స్ ఇండియా టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు.
News November 6, 2025
మెంటాడ మార్పుపై ఎటువంటి ప్రతిపాదన చేయలేదు: మంత్రి

మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో చేర్చాలనే అంశంపై తాను ఎటువంటి ప్రతిపాదన చేయలేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. జడ్పీ సమావేశంలో జడ్పీటీసీ సన్యాసినాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ఆందోళనలో చేపడుతున్నారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇతర జిల్లాల నుంచి మాత్రమే ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అనవసర ఆందోళనలు వద్దని సూచించారు.


