News March 28, 2025
ఏప్రిల్ 14న సెలవు

ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్రం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలకు సెలవు ఉండనున్నట్లు తెలిపింది. కాగా అదే రోజున తెలంగాణ, ఏపీలోనూ పబ్లిక్ హాలిడే ఉంది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మూసివేయనున్నారు.
Similar News
News April 1, 2025
పంత్ ఫ్లాప్ షో.. రూ.27 కోట్లు.. 17 రన్స్

IPL హిస్టరీలోనే అత్యధిక వేతనం(రూ.27 కోట్లు) తీసుకుంటున్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. 3 మ్యాచ్‌లలో 17 రన్స్(DCపై 0, SRHపై 15, PBKSపై 2) మాత్రమే చేశారు. దీంతో ఆ జట్టు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీపర్, కెప్టెన్‌గానూ ఆకట్టుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇతనొక ఓవర్ రేటెడ్ ప్లేయర్ అని ఫైరవుతున్నారు. తర్వాతి మ్యాచ్‌లలోనైనా పుంజుకోవాలని కోరుకుంటున్నారు.
News April 1, 2025
టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

APలో టెన్త్ పరీక్షలు ముగిశాయి. మార్చి 17న తెలుగు పరీక్షతో ప్రారంభమైన పరీక్షలు ఇవాళ సోషల్ స్టడీస్‌తో ముగిశాయి. 6.24 లక్షల మంది విద్యార్థులకు గాను 6.17 లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమై ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత పలు దఫాల పరిశీలన అనంతరం మే రెండో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది.
News April 1, 2025
మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళా క్రికెటర్ల జంట

ENG మహిళా క్రికెటర్లు నాట్ స్కివర్ బ్రంట్, క్యాథరిన్ స్కివర్ బ్రంట్ మగబిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు థియోడోర్ మైకేల్ స్కివర్ బ్రంట్ అని పేరు పెట్టినట్లు నాట్ ఇన్‌స్టాలో వెల్లడించారు. నాట్, క్యాథరిన్ 2022లో వివాహం చేసుకున్నారు. తమ చివరి పేరును స్కివర్ బ్రంట్‌గా మార్చుకున్నారు. వీరు రెసిప్రోకల్ IVF విధానంలో పేరెంట్స్ అయినట్లు తెలుస్తోంది. నాట్ WPLలో MIకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.