News March 28, 2025
ట్రంప్ కొరడా.. ఆరోగ్య శాఖలో 10వేల మందికి చెక్

ప్రభుత్వ శాఖల్లో ఖర్చును తగ్గించాలని నడుం బిగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆరోగ్య శాఖపై కొరడా ఝుళిపించారు. ఆ శాఖలోని 10వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ చర్యలు చేపట్టారు. ఎక్కువగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌లో 3,500మందిని తొలగించనున్నారు. ఈ నిర్ణయంతో ఏడాదికి 1.8బిలియన్ డాలర్లు ఆదా అవుతుందని ఆయన వెల్లడించారు.
Similar News
News April 1, 2025
టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

APలో టెన్త్ పరీక్షలు ముగిశాయి. మార్చి 17న తెలుగు పరీక్షతో ప్రారంభమైన పరీక్షలు ఇవాళ సోషల్ స్టడీస్‌తో ముగిశాయి. 6.24 లక్షల మంది విద్యార్థులకు గాను 6.17 లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమై ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత పలు దఫాల పరిశీలన అనంతరం మే రెండో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది.
News April 1, 2025
మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళా క్రికెటర్ల జంట

ENG మహిళా క్రికెటర్లు నాట్ స్కివర్ బ్రంట్, క్యాథరిన్ స్కివర్ బ్రంట్ మగబిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు థియోడోర్ మైకేల్ స్కివర్ బ్రంట్ అని పేరు పెట్టినట్లు నాట్ ఇన్‌స్టాలో వెల్లడించారు. నాట్, క్యాథరిన్ 2022లో వివాహం చేసుకున్నారు. తమ చివరి పేరును స్కివర్ బ్రంట్‌గా మార్చుకున్నారు. వీరు రెసిప్రోకల్ IVF విధానంలో పేరెంట్స్ అయినట్లు తెలుస్తోంది. నాట్ WPLలో MIకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
News April 1, 2025
వక్ఫ్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తాం: KC వేణుగోపాల్

I.N.D.I అలయెన్స్ పార్టీలన్నీ కలిసి వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ‘వక్ఫ్ సవరణ బిల్లుపై మేం తొలినుంచీ వ్యతిరేక వైఖరితోనే ఉన్నాం. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం. కచ్చితంగా వ్యతిరేకిస్తాం. మా కూటమి పార్టీలన్నీ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఇతర పార్టీలు కూడా మాతో కలిసిరావాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.