News March 28, 2025

జగిత్యాల మార్కెట్ ధరల సమాచారం మీ కోసం

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి.. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,215, కనిష్ట ధర రూ. 1,918లుగా పలికాయి. అటు కందులు గరిష్ఠ ధర రూ. 6,495, కనిష్ఠ ధర రూ. 5,500, అనుములు రూ. 4896, పసుపు కాడి గరిష్ఠ ధర రూ. 11,000, కనిష్ఠ ధర రూ. 7,000, పసుపు గోళం గరిష్ఠ ధర రూ. 9,500, కనిష్ఠ ధర రూ. 5,000, వరి ధాన్యం (జైశ్రీరాం రకం) రూ. 2,311లుగా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.

Similar News

News April 1, 2025

కడపలో హిజ్రాల ఆందోళన

image

పదేళ్లుగా హిజ్రాతో సహజీవనం చేసి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హిజ్రాలు కోరారు. ఈ మేరకు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు 50మందికి పైగా హిజ్రాలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సీఐ రామకృష్ణ జోక్యం చేసుకుని విచారించి న్యాయం చేస్తామన్నారు. ఆయన హామీతో హిజ్రాలు ఆందోళన విరమించారు.

News April 1, 2025

ఇళ్ల నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయం: ప్రభుత్వం

image

AP: SC, ST, BC, ఆదివాసీ గిరిజనుల(PVTG) వర్గాల లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో అసంపూర్తిగా ఉన్నవాటి నిర్మాణం కోసం రూ.3220 కోట్ల అదనపు సాయాన్ని కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘మారిన ఖర్చుకు తగిన విధంగా ఎస్సీలకు రూ.50వేలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నాం’ అని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ MD రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

News April 1, 2025

GNT: హైకోర్టుకు మాజీమంత్రి విడదల రజిని

image

ఏసీబీ కేసులో ఏపీ హైకోర్టును మంగళవారం మాజీ మంత్రి విడదల రజిని ఆశ్రయించారు. ఏసీబీ కేసు నుంచి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ పిటిషన్లు దాఖలు చేశారు. వివరాలు సమర్పించాలని హైకోర్టు ఏసీబీకి ఆదేశించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

error: Content is protected !!