News March 28, 2025

రైతులు పరిహారం సద్వినియోగించుకోవాలి: VKB కలెక్టర్

image

ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటకు సంబంధించిన పట్టా భూమి కలిగిన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమ్మతి తెలిపిన రైతులకు తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌లతో కలిసి నష్ట పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.

Similar News

News July 10, 2025

పార్వతీపురం జిల్లా రైతులకు ముఖ్య గమనిక

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు పంట భీమా పథకాన్ని అమలు చేస్తున్నాయని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులకు తక్కువ ప్రీమియం చెల్లింపుతో బీమా పథకం అమలు జరుగుతుందని చెప్పారు. పత్తి, అరటి పంటల బీమా జూలై 15, మొక్కజొన్న పంటకు జూలై 31, వరి పంటకు ఆగస్టు 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని కలెక్టర్ సూచించారు.

News July 10, 2025

NLG: మూసీ నది జన్మస్థానం మీకు తెలుసా?

image

మూసీ నది 2,168 అడుగుల ఎత్తులో ఉద్భవిస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా దీని జన్మస్థానం వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు. అక్కడ ఒక్కో బొట్టుగా మొదలై అనంతపద్మనాభుని ఆలయ కొలనులోకి చేరుతుంది. దీని ప్రవాహం అక్కడ మొదలై నదిగా మారి HYDలోకి ఎంట్రీ పోచంపల్లి, కేతేపల్లి గుండా నల్గొండ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మహానగరమంతా దీని ఒడ్డునే జీవం పోసుకుంది. ముచ్కుంద మహానది కాలక్రమేనా మూసీగా పేరు మారింది.

News July 10, 2025

ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌వో‌ల పాత్ర కీలకం: ఆర్వో

image

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌వో‌ల పాత్ర కీలకమైందని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ రవీంద్ర బాబు అన్నారు. బుధవారం ఎస్బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో బీఎల్‌లోలకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో బీఎల్‌వోలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్ఓకు 6 రోజులు శిక్షణ ఉంటుందన్నారు.