News March 28, 2025

అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి: ADB DIEO

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదిలాబాద్ ఇంటర్ విద్యాశాఖ అధికారి జాదవ్ గణేశ్ కుమార్ సూచించారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 2 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. పది పరీక్షలు రాస్తున్న విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి వారికి ప్రభుత్వ కళాశాల గురించి వివరించాలని సూచించారు. ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్ సౌకర్యాలను వివరించాలన్నారు.

Similar News

News October 28, 2025

ఆదిలాబాద్: ఏజెన్సీ సర్టిఫికెట్ల మాఫియా బహిర్గతం: ASU

image

ఫేక్ ఏజెన్సీ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు కొల్లగొట్టిన లంబాడ తెగ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ ASU జిల్లా కార్యదర్శి సిడాం శంభు డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ రిజర్వేషన్ హక్కులపై కత్తి లాంటి దెబ్బగా మారిన ఫేక్ ఏజెన్సీ సర్టిఫికెట్ల మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉట్నూర్ మండలానికి చెందిన జాదవ్ నికేశ్ కేసు ఇందుకు నిదర్శనమన్నారు.

News October 28, 2025

సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలి: ఆదిలాబాద్ కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్‌(CMR) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎంఆర్ సరఫరా పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సన్నబియ్యం మిల్లింగ్, సరఫరా పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు.

News October 28, 2025

ADB: అక్రమార్కులకు రాజకీయ అండదండలు..!

image

జిల్లాలో కొందరు రాజకీయ నాయకుల ముసుగులో రౌడీషీటర్లు, గూండాలు అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెలుగు చూస్తున్నాయి. నేతల అండతోనే రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారని తెలుస్తోంది. ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక దృష్టి సారించి, రౌడీషీటర్ల అక్రమ భాగోతాలను వెలికితీస్తున్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు రావడంతో, పోలీసులు కొరడా ఝళిపించి ఇటీవల భూదందాలు, పలు వివాదాల్లోని రౌడీషీటర్లు, నాయకులను జైలుకు పంపారు.