News March 28, 2025
ఎన్టీఆర్ జిల్లా ప్రజలు జాగ్రత్త

జిల్లాలో నేడు పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. వడగాలులకు గురవ్వకుండా ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఈ మేరకు తమ X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. చందర్లపాడు 43.3, గంపలగూడెం 42.3, మైలవరం 43.1, నందిగామ 43.4, రెడ్డిగూడెం 42.2, వీరులపాడు 43.7, విస్సన్నపేట 41.6, విజయవాడ అర్బన్ & రూరల్ 42.5
Similar News
News November 9, 2025
నవంబర్ 9: చరిత్రలో ఈరోజు

* 1877: కవి మహమ్మద్ ఇక్బాల్ జననం
* 1895: ఆధునిక ఆంధ్ర కవి దువ్వూరి రామిరెడ్డి జననం
* 1924: రచయిత, కథకుడు కాళీపట్నం రామారావు జననం
* 1978: సినీనటుడు రాజా పుట్టినరోజు
* 2005: మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మరణం
* 2009: నోబెల్ గ్రహీత హరగోబింద్ ఖురానా మరణం(ఫొటోలో)
* జాతీయ న్యాయ సేవల దినోత్సవం
News November 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 9, 2025
జిల్లాలో 48,325 MTల ధాన్యం కొనుగోళ్లు పూర్తి

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకొని రైతులు మద్దతు ధర పొందాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ కోరారు. వేములవాడ పరిధిలోని బాలానగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 48,325 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 238 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.


