News March 28, 2025

కళకళలాడుతోన్న చార్మినార్

image

అర్ధరాత్రి చార్మినార్ కళకళలాడుతోంది. రంజాన్‌ మాసంలో నేడు చివరి శుక్రవారం కావడంతో‌ మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల(అల్ విధా జుమ్మా) కోసం ఏర్పాట్లు చేశారు. పండుగకు మరో రెండ్రోజులే సమయం ఉండటంతో జనాలు షాపింగ్‌ కోసం క్యూకట్టారు. కమాన్ రోడ్, భాగ్యలక్ష్మీ టెంపుల్ రోడ్, లాడ్ బజార్, న్యూ లాడ్‌ బజార్, రాత్‌ఖానా గల్లీ, మోతీ గల్లీలు కిక్కిరిసిపోయాయి. వాహనాలు పార్కింగ్‌కు స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.

Similar News

News September 14, 2025

మిలాద్ ఉన్న నబీ ర్యాలీ.. HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

image

మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉ.8 నుంచి రా.8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫలక్‌నుమా, ఇంజిన్‌బౌలి, నాగుల్ చింత X రోడ్, హరిబౌలి, చార్మినార్, గుల్జార్‌హౌస్, మదీనాజంక్షన్, మీరాలంమండీ, బీబీబజార్, అఫ్జల్‌గంజ్ టీ జంక్షన్, MJమార్కెట్ జంక్షన్, నాంపల్లి ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు మూసి ఉంటాయన్నారు.

News September 14, 2025

ఉల్లి కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ఉత్పత్తులను కలెక్టర్ సిరి శనివారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ నవ్యతో కలిసి ఎగుమతుల పరిస్థితి, కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉల్లి కొనుగోలు విషయంలో ఆలస్యం లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర తప్పనిసరిగా చెల్లించాలన్నారు.

News September 14, 2025

కృష్ణ- వికారాబాద్ రైల్వే లైన్ పనులకు కొత్త ప్రతిపాదనలు

image

వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సీఎంతో జరిగిన సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం సూచించిన కొత్త రైల్వే ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌తో DPR రైల్వే బోర్డుకు సమర్పించనున్నారు.