News March 28, 2025
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ హెచ్చరికలు జారీ

శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు వాయిదా పడిన రామగిరి, గాండ్లపెంట ఎంపీపీల స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా గొడవలు సృష్టించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ రత్న హెచ్చరించారు. ఎన్నికల సమయంలో 30 యాక్ట్ అమలులో ఉంటుందని, 144 సెక్షన్ అమలు పరచడం జరుగుతుందన్నారు. నిరంతరం సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
Similar News
News December 31, 2025
బాపట్ల జిల్లా TODAY TOP NEWS

◆ ప్రకాశంలోకి అద్దంకి.. బాపట్ల జిల్లాకు భారీ నష్టం.?
◆ 2025లో ఎన్ని డ్రంక్&డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటే..!
◆ మహిళా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: SP
◆ నగరం పోలీస్ స్టేషన్‌లో SP తనిఖీలు
◆ ప్రజా సమస్యల పరిష్కారానికి పునర్విభజన: మంత్రి
◆ బాపట్ల: సదరం క్యాంపులో దివ్యాంగుల అగచాట్లు
◆ పది మండలాలతో అద్దంకిలో రెవెన్యూ డివిజన్
◆ పర్చూరు నుంచి తిరుమలకు కూరగాయలు
◆ చీరాల ఏరియా ఆసుపత్రిలో కమిషనర్, కలెక్టర్ తనిఖీలు
News December 31, 2025
కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా వేగవంతమైన శిక్షలు: జిల్లా ఎస్పీ

కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా వేగవంతమైన దర్యాప్తుతో త్వరితగతిన శిక్షలు సాధ్యమయ్యాయని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. 11 తీవ్రమైన నేరాల కేసులలో 16 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్షలు పడినట్లు తెలిపారు. మరో 3 కేసుల్లో 4 మంది నిందితులకు 10 సంవత్సరాలకు పైగా శిక్షలు పడ్డాయన్నారు. జిల్లాలో 2023లో 304 కేసుల్లో, 2024లో 304 కేసుల్లో, 2025లో 314 కేసుల్లో శిక్షలు విధించబడ్డాయన్నారు.
News December 31, 2025
కామారెడ్డి: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై చర్యలు

కామారెడ్డి జిల్లాలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు ఆటో రిక్షాలు, మినీ క్యాబ్‌లపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాన్సువాడ, పిట్లం, తాడ్వాయి, కామారెడ్డి ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను గుర్తించి సీజ్ చేశారు.


