News March 28, 2025
అమలాపురం: రీసర్వే ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలి

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియ చట్టపరమైన సూత్రాల అనుగుణంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాలోని మూడు డివిజన్లకు చెందిన ఎమ్మార్వోలు, డిప్యూటీ ఎమ్మార్వోలు,మండల, గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలతో రీసర్వే పై శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పైలెట్ కార్యక్రమం పూర్తయిందని సర్వేను ప్రారంభించాలన్నారు.
Similar News
News November 8, 2025
భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

2018 నవంబర్ 18న భార్య లక్ష్మీ దేవిని గొంతు నులిమి చంపిన కేసులో కర్నూలు శివప్ప నగర్‌కు చెందిన ముద్దాయి శ్రీనివాసులుకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. ముద్దాయి 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్నాడు. 2007లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీనివాసులు అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
News November 8, 2025
వీధి కుక్కల విషయంలో SC మార్గదర్శకాలివే..

వీధి కుక్కల నియంత్రణపై రాష్ట్రాలకు SC మార్గదర్శకాలు జారీ చేసింది. ‘విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వాటిని షెల్టర్లకు తరలించాలి. జంతువులు రాకుండా ఫెన్స్ నిర్మించాలి. వాటికి సంతానోత్పత్తి నియంత్రణ చికిత్స చేశాక అదేచోట వదలొద్దు. అలాగే NH, ఎక్స్‌ప్రెస్ హైవేలపై యజమానిలేని పశువులను గోశాలలకు తరలించాలి. ప్రభుత్వాలు, NH శాఖ ఈ ఆదేశాలను అమలు చేయాలి’ అని తెలిపింది.
News November 8, 2025
అశ్వని కురిస్తే అంతా నష్టం

అశ్వని కార్తె వేసవి ప్రారంభంలో(ఏప్రిల్-13/14) నుంచి వస్తుంది. ఈ సమయంలో వర్షాలు పడితే, దాని ప్రభావం తర్వాత ముఖ్యమైన వర్షాధార కార్తెలైన భరణి, కృత్తిక, రోహిణిపై పడుతుందని, ఫలితంగా వర్షాలు సరిగ్గా కురవవని నమ్ముతారు. దీని వల్ల వ్యవసాయ పనులకు ఆటకం కలిగి పంట దిగుబడి తగ్గుతుందని, అన్నదాతలకు నష్టం వాటిల్లుతుందని ఈ సామెత వివరిస్తుంది.


