News March 25, 2024
వైసీపీ కాలకేయులకు ఇదే నా హెచ్చరిక: లోకేశ్

AP: జగన్ గొడ్డలితో తెగబడితే, YCP కార్యకర్తలు వేటకొడవళ్లతో జనాల్ని వేటాడుతున్నారని TDP నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ‘సత్యసాయి జిల్లా కుటాలపల్లిలో TDP కార్యకర్త అమర్నాథరెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. అది ముమ్మాటికీ YCP సైకోల పనే. ఓటమి భయంతో మా కార్యకర్తల్ని అంతమొందిస్తున్నారు. YCP కాలకేయులకు ఇదే నా హెచ్చరిక. మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేడు’ అని వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News January 15, 2026
బంగ్లా క్రికెట్లో తిరుగుబాటు: బోర్డు డైరెక్టర్ రాజీనామాకు డిమాండ్!

BCB డైరెక్టర్ నజ్ముల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్లో చిచ్చు రేపాయి. T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొంటే ఆటగాళ్లకు నష్టపరిహారం చెల్లించబోమని అనడంపై క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నజ్ముల్ వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వివాదం ముదరడంతో స్పందించిన బోర్డు, ఆ వ్యాఖ్యలు తమ అధికారిక వైఖరి కాదంటూ విచారం వ్యక్తం చేసింది.
News January 15, 2026
MOIL లిమిటెడ్‌లో 67 పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 15, 2026
సంక్రాంతి అల్లుడికి 158 రకాల వంటకాలతో విందు

AP: గోదావరి జిల్లాలను మరిపించేలా ఈసారి తెనాలి వాసులు అల్లుడికి 158 రకాల వంటకాలతో అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. తెనాలికి చెందిన మురళీకృష్ణ తన కుమార్తె మౌనికను రాజమండ్రికి చెందిన శ్రీదత్తకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి కళ్లు చెదిరే విందు ఏర్పాటు చేశారు. రకరకాల పిండి వంటలు, ఫలహారాలు, పండ్లతో భోజనం వడ్డించి ఆశ్చర్యపరిచారు.


