News March 28, 2025

ASF: ‘అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి’

image

జాతీయ గ్రామీణ హామీ పథకం క్రింద జిల్లాలో చేపట్టిన సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులు ఈ నెల 30లోగా పూర్తి చేసి ఎంబీ రికార్డులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు 4 రోజులు మిగిలి ఉన్నాయన్నారు.

Similar News

News November 10, 2025

12 నుంచి MGMలో స్పెషల్ సదరం క్యాంపు

image

ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు MGMలో స్పెషల్ సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఇందుకు అర్హులైన వారు ఆన్ లైన్‌లో మీసేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.

News November 10, 2025

తక్షణ సాయంగా ₹901 కోట్లు ఇవ్వండి: AP

image

AP: మొంథా తుఫాను నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ₹6384CR న‌ష్టం వాటిల్లిందని, ₹901.4 కోట్లు త‌క్ష‌ణ సాయంగా అందించాలని రాష్ట్ర అధికారులు కోరారు. 1.61 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట‌లు దెబ్బ‌తిన్న‌ట్లు చెప్పారు. ఉద్యాన‌, మ‌ల్బ‌రీ తోట‌లూ దెబ్బతిన్నాయని వివరించారు. 4,794KM రోడ్లు, 3,437 మైనర్ ఇరిగేషన్ ప‌నులు, 2,417 ఇతర ప్రాజెక్టులకు న‌ష్టం వాటిల్లిందని తెలిపారు.

News November 10, 2025

KMR: కలెక్టరేట్‌లో ప్రజావాణికి 80 అర్జీలు

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ద్వారా 80 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం ఆయన సంబంధిత జిల్లా అధికారులకు దరఖాస్తులను అందజేశారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పరిధిలో పరిష్కరించలేని సమస్యలపై దరఖాస్తుదారులకు సూచనలు ఇవ్వాలని సూచించారు.