News March 28, 2025
సంగారెడ్డి: ‘సెర్ఫ్ లక్ష్యసాధనకు కృషి చేయండి’

సెర్ఫ్ లక్ష్య సాధనకు కృషి చేయాలని పంచాయతీ రాజ్ రాష్ట్ర కార్యదర్శి లోకేశ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఐకెపీ కేంద్రాలకు చెల్లించాల్సిన పెండింగ్ కమిషన్ వెంటనే చెల్లించాలని చెప్పారు. స్టిచ్చింగ్ కేంద్రాల ద్వారా ప్రైవేట్ ఆర్డర్లు సైతం చేపట్టాలని సూచించారు.
Similar News
News April 2, 2025
MDCL: ప్రభుత్వానికి బిగ్ THANKS: HCA

HYD ఉప్పల్ స్టేడియంలో ఉచిత పాసులు ఇవ్వకపోవడంపై SRHపై HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్‌రావు ఒత్తిడి తెచ్చారని వచ్చిన వార్తల నేపథ్యంలో, ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించి చర్యలు చేపట్టింది. దీనిపై స్పందించిన జగన్మోహన్ రావు ప్రభుత్వానికి X వేదికగా బిగ్ థ్యాంక్స్ చెప్పారు. ప్రభుత్వ జోక్యం, SRH, అపెక్స్ కౌన్సిల్ కలిసి రాబోయే మ్యాచ్ సక్సెస్ కావడం కోసం చేపట్టిన చర్యలను అభినందించారు.
News April 2, 2025
మగవారితో పోలిస్తే అతివల్లో ఎక్కువ నిద్రలేమి

ఆరోగ్యానికి చక్కటి నిద్ర అత్యవసరం. కానీ పురుషులతో పోలిస్తే మహిళల్లో నిద్రలేమి ఎక్కువ ఉందని USకు చెందిన ‘రెస్‌మెడ్’ సంస్థ అధ్యయనంలో తేలింది. దాని ప్రకారం.. వారంలో పురుషులు సగటున 4.13 రాత్రుళ్లు హాయిగా నిద్రపోతుంటే స్త్రీలు 3.83 రాత్రుళ్లు మాత్రమే సరైన నిద్రపోతున్నారు. హార్మోన్ల మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళనల వంటి కారణాలు స్త్రీల నిద్రని ప్రభావితం చేస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.
News April 2, 2025
HCU భూముల వివాదంపై సెలబ్రిటీల స్పందన

హెచ్‌సీయూ భూముల వివాదంపై సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇషా రెబ్బా, రేణూ దేశాయ్, ప్రియదర్శి, ఉపాసన కొణిదెల, కావ్య కళ్యాణ్‌రామ్, రష్మీ గౌతమ్, అభినవ్ గోమఠం, నోయెల్ షాన్, ప్రియాంక జవాల్కర్ తమ ఇన్‌స్టాల్లో హెచ్‌సీయూ భూముల్ని, అక్కడి ప్రాణుల్ని కాపాడాలనే అర్థంలో స్టోరీలు పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.