News March 28, 2025

బాలికల గురుకులాల్లో పురుష సిబ్బంది ఉండొద్దు: ఎస్సీ సొసైటీ

image

TG: SC బాలికల గురుకులాలు, కాలేజీల్లోని అన్ని పోస్టుల్లో మహిళా సిబ్బందే ఉండాలని SC గురుకుల సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో 1274 ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని తెలిపింది. బాలికల విద్యాలయాల్లో ఎవరైనా పురుష సిబ్బంది కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బాలుర స్కూళ్లు, కాలేజీలను జనరల్‌గా పరిగణించి వాటిలోని పోస్టులను మహిళలు, పురుషులతో భర్తీ చేస్తామని పేర్కొంది.

Similar News

News November 6, 2025

MOILలో 99 ఉద్యోగాలు

image

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<>MOIL<<>>)లో 99 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. ఎలక్ట్రీషియన్, మెకానిక్ కమ్ ఆపరేటర్ , మైన్ ఫోర్‌మెన్, సెలక్షన్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్, మైన్‌మేట్, బ్లాస్టర్ గ్రేడ్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.295. వెబ్‌సైట్: https://www.moil.nic.in/

News November 6, 2025

‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

image

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.

News November 6, 2025

బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

image

బిహార్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.