News March 28, 2025

భద్రాచలంకు రూ.35 కోట్లు.. సీఎంకు ఎమ్మెల్యేల కృతజ్ఞతలు

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ అభివృద్ధికి రూ.35 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.

Similar News

News April 2, 2025

అద్దంకిలో ప్రజా సమస్యలపై మంత్రి గొట్టిపాటి ఆరా

image

అద్దంకి పట్టణంలోని భవాని కూడలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పర్చూరు నియోజకవర్గంలో సీఎం పర్యటన అనంతరం కనిగిరి వెళ్లి తిరిగి వెళ్తూ భవాని సెంటర్లో ఆగారు. అక్కడ ప్రజలతో మాటలు కలిపి సమస్యలపై ఆరా తీశారు. సీఐ సుబ్బరాజు మంత్రి భద్రతను పర్యవేక్షించారు.

News April 2, 2025

నారాయణపేట: ARMY జాబ్స్ కొట్టారు.. సన్మానం

image

నారాయణపేట జిల్లా కేంద్రంలోని అవంగాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్, రహిమాన్ పాషా ఆర్మీకి సెలెక్ట్ కావడంతో తోటి మిత్రులు, గ్రామస్థులు వారిని అభినందిస్తూ వారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని, యువకులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

News April 2, 2025

FREE బస్సు.. మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో ఇదీ పరిస్థితి..!

image

ఫ్రీ బస్సు కారణంగా తాము బస్సు ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయిందని పలువురు పురుషులు మంగళవారం వాపోయారు. మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో వచ్చిన బస్సులన్నింటిలో మహిళలు పెద్ద ఎత్తున ఎక్కుతుండడంతో తమ పరిస్థితి ఏంటని పురుషులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్, మంగళవారం సెలవు, బుధవారం వర్కింగ్ డే కావడంతో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు.

error: Content is protected !!