News March 28, 2025
పెనగలూరు: అన్నను చంపిన తమ్ముడికి జీవిత ఖైదు

పెనగలూరు మండలం, ఓబిలి గ్రామానికి చెందిన బుర్రకట్ల మహేశ్వరయ్యను ఇనుప రాడ్డుతో తలపై మోది చంపిన తమ్ముడు బుర్రకట్ల ఈశ్వరయ్య చంపాడు. ఈకేసులో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ రాజంపేట 3వ అదనపు జిల్లా జడ్జి గురువారం తీర్పు చెప్పారు. 2020 సంవత్సరం జనవరి నెలలో నేరం చేసిన ముద్దాయికి ఎట్టకేలకు శిక్ష ఖరారు అయింది. కోర్టు తీర్పు ఒక గుణపాఠం కావాలని, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు.
Similar News
News April 2, 2025
నేడు ప్రకాశం జిల్లాకు అనంత్ అంబానీ

AP: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలంలోని దివాకరపురం సమీపంలో రూ.375 కోట్లతో నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌కు ఆయన భూమిపూజ చేస్తారు. ఆయనతోపాటు మంత్రి లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
News April 2, 2025
ఏప్రిల్2: చరిత్రలో ఈరోజు

1915: తెలుగు సినిమా నటుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జననం
1969: నటుడు అజయ్ దేవగన్ జననం
1981: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ జననం
1872: టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త శామ్యూల్ F.B మోర్స్ మరణం
1933: భారత మాజీ క్రికెటర్ రంజిత్ సిన్హ్‌జీ మరణం
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం
News April 2, 2025
భదాద్రి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యుల నియామకం

భద్రాద్రి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులుగా ప్రముఖ సీనియర్ న్యాయవాదులు లక్కినేని సత్యనారాయణ, అనుబ్రోలు రాంప్రసాద్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు జారీ చేసిన G.O. No.198 ప్రకారం వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ నియామకం ద్వారా న్యాయ సేవాధికార సంస్థ మరింత బలోపేతం అవుతుందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.